ఉన్నత విద్యావంతులు సంఖ్య పెంచుతాం..


Ens Balu
4
Andhra University
2020-08-15 19:27:23

ఉన్నత విద్యను అభ్యశించే వారి శాతం 31.25 నుంచి 50 శాతానికి పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషిచేస్తామని ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. శనివారం  ఏయూలో స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. అనంతరం మాట్లాడుతూ 2029 నాటికి 50 శాతం జిఇఆర్‌ ‌చేరుకోవడం తమ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి దీనిని సాధించే దిశగా అవసరమైన జగనన్న విద్యా దివేన, జగనన్న వసతి దీవెన పథకాలను నిర్వహించడం ముదావహమన్నారు. విద్యార్థిని ఆవిష్కర్తగా, పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏపి ఎంటర్‌ప్యూనర్‌ ‌బోర్డ్, అటల్‌ ఇం‌క్యుబేషన్‌ ‌సెంటర్‌లు ఉపకరిస్తాయన్నారు.  మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ ‌కలాం చెప్పినట్టుగా అధ్యాపక వృత్తి ఎంతో ఉతృష్టమైనదన్నారు. వ్యక్తి సామర్ధ్యాలను, నైతిక విలువలను, గుణాలను తీర్చిదిద్ధి భవిష్యత్‌ ‌పౌరులను అందించే శక్తి విద్యకు ఉందన్నారు. మేధో సంపదను, నైతికతను పెంపొందించే కేంద్రాలుగా  విశ్వవిద్యాలయాలు నిలుస్తాయని, ఇవి నిరంతరం తమ ప్రమాణాలు మెరుగుపరచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. దేశభక్తే దేశాన్ని సమైక్యంగా ఉంచుతోందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తుచేసుకోవడం, వారి త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరమన్నారు. ముందుగా ఏయూ పరిపాలనా భవనం వద్దనున్న మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, అకడమిక్‌ ‌డీన్‌ ఆచార్య కె.వెంకట రావు, ప్రిన్సిపాల్స్, ‌డీన్‌లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు