జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం క్రుషి..


Ens Balu
3
Visakhapatnam
2021-01-23 19:41:41

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం క్రుషిచేయాలని కోరుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగారు అశోక్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బ్రుందం వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ ను కలిసి శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విశాఖలోని వంశీ  కార్యాలయంలో కలిసిన జర్నలిస్టులు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను  వివరించారు. ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంతోపాటు జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలు అందించి సొంతింటి కల నెరవేరే విధంగా చేయాలని కోరారు.  సాధ్యమైనంత త్వరగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయించే ఏర్పాటు చేయాలని కోరారు.  దీనిపై స్పందించిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమర్పించిన సమస్యలను, డిమాండ్ లను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. అదేసమయంలో జర్నలిస్టులు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ప్రజలకు ప్రత్యేక కధనాల ద్వారా చేరువ చేయాలన్నారు. కనీస అర్హతలతో జర్నలిజంలోకి రావడం ద్వారా మంచి జర్నలిజం చేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ జర్నలిస్టుల పక్షపాతిగా వుంటుందని అన్నారు. వాస్తవాలను మాత్రమే జర్నలిస్టులు ప్రజలు, ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా యూనియన్ డైరీని వంశీక్రిష్ణ శ్రీనివాస్ కు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  అధ్యక్షుడు అశోక్ అందజేశారు. తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు రామకృష్ణ,సహకార్యదర్శి పద్మజ,కార్యవర్గ సభ్యులు సాగర్, సభ్యులు నాగు, ఈశ్వర్, సురేష్, వెంకటలక్ష్మి, సూర్య తదితరులు పాల్గొన్నారు.