గణతంత్ర దినోత్సవాలకు ఏర్పాట్లు..


Ens Balu
3
Visakhapatnam
2021-01-23 20:35:57

విశాఖలో ఈనెల 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సంయుక్త కలెక్టరు యం. వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయమై శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్  పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన   వేదికపై జిల్లా కలెక్టరు, జిల్లా మేజిస్ట్రేట్ అయిన వి.వినయ్ చంద్ పతాకావిష్కరణ చేస్తారని, అనంతరం పోలీసు వందనం స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు పారిశుద్ధ్యం జీవీఎంసీ వారు చూసుకోవాలని,  విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి మొత్తం కార్యక్రమ ఏర్పాట్లును పర్యవేక్షించాలన్నారు. పాఠశాల పిల్లల  సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈఓ ను ఆదేశించారు. వేదికను అలంకరించాలని  ఉద్యానవన శాఖ, వి.ఎం. ఆర్. డి. ఎ. అధికారులను ఆదేశించారు.  కార్యక్రమం జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ ఈఈని ఆదేశించారు.  కార్యక్రమ నిర్వహణకు అవసరమైన  విషయాలను ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఎస్.డి.సి. రంగయ్య, డిఆర్ఓ ప్రసాద్, ఏ.వో. రామ్మోహన్ రావు, పౌరసరఫరాల అధికారులు నిర్మలాబాయి,  శివ ప్రసాద్, సి.పి.ఓ. ప్రకాష్ రావు, జీవీఎంసీ, వుడా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.