ఓటు పవిత్రను ప్రతీఒక్కరూ గుర్తించాలి.


Ens Balu
2
Visakhapatnam
2021-01-25 18:15:26

ధనిక, పేద, కులం, మతం, ప్రాంతం, లింగ వివక్షకు తావులేకుండా సమానత్వానికి ప్రతీక గా అందరికీ ఓటు హక్కు కల్పించిన దేశం మనదని   అని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం నాడు స్థానిక విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా లో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం జిల్లా స్థాయి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి పవిత్రమైన బాధ్యత అని, ముఖ్యంగా కొత్త గా ఓటర్లు గా నమోదైన యువతీయువకులు ఈ విషయాన్ని విస్మరించరాదని అన్నారు. సమాజంలో ని సమస్యలను పరిష్కరించగలిగే సమర్ధత కలిగిన నాయకులను ఆలోచించి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు 11 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఇచ్చిన సందేశాన్ని ప్రదర్శించారు. అనంతరం విశాఖపట్నం ఆర్డీవో పి. కిషోర్ కార్యక్రమానికి హాజరైన వారందరిచే,   ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. తరువాత జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తున్న వ్యవస్థ గా ప్రఖ్యాతి గాంచిందని అన్నారు. ప్రజల భాగస్వామ్యం తోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని, 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు గా నమోదు చేసుకోవాలని కోరారు.  ప్రతి సంవత్సరం, ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల ను నమోదు చేసుకోవడంతో పాటు, వలసలు, మరణాలు, ఇంకా వివరాలలో మార్పులు చేర్పులు చేస్తారని తెలిపారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి‌, ఓటర్ల నమోదు నుంచి చివరకు పోలింగ్ అనంతరం ఫలితాలు ప్రకటించే వరకు వేగంగా, ఖచ్చితంగా పనిచేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు ఈ- ఎపిక్ ( E-epic) కార్డులను ఆవిష్కరించారని అన్నారు. తరువాత జీవీఎంసీ కమీషనర్ డా. జి.సృజన మాట్లాడుతూ, ఓటు అనేది హక్కు, బాధ్యత ల మేలు కలయిక అని వివరించారు. ఓటు మన జీవన గమనాన్ని మార్చే శక్తిని కలిగి ఉందని తెలిపారు.  యువత వివేకంతో, సరియైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇంకా ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ,,జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు లు కార్యక్రమంలో ప్రసంగించారు. తరువాత కొత్త గా ఓటు హక్కు పొందిన యువతీయువకులకు ఓటరు గుర్తింపు కార్డులను అందజేశారు. సీనియర్ సిటిజన్ వడ్లమూడి దుర్గ ను సన్మానించారు. ఓటరు నమోదు కార్యక్రమం లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బంది కి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎ.ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.