కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు..


Ens Balu
6
Visakhapatnam
2021-01-25 21:24:45

జర్నలిస్టు కుటుంబాలు శుభిక్షంగా ఉండాలని, కరోనా వైరస్ పూర్తిగా సమసి పోవాలని వేడుకుంటూ శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాత్రి ఈమేరకు అమ్మవారిని ధర్శించుకొని, విగ్రహానికి పాలభిషేకం చేసి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, అమ్మలగన్న అమ్మ, ఉత్తరాంధ్రాను చల్లగా కాచికాపాడే కనకమహాలక్ష్మీ తల్లికి ప్రత్యేక పూజలు చేసినట్టు చెప్పారు. జర్నలిస్టుల కష్టాలు, సమస్యలు తీర్చి చల్లగా చూసేలా అమ్మవారిని వేడుకున్నట్టు వివరించారు. తన జీవితాంతం జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు సేవచేసే భాగ్యాన్ని కూడా ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నాని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా వుందని వివరించారు. త్వరలోనే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.