ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి..


Ens Balu
3
Srikakulam
2021-01-27 17:03:30

ఎన్నికలు పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. పంచాయతీ ఎన్నికలపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, రూట్ మేప్ లు పక్కాగా తయారు చేయాలని ఆయన ఆదేశించారు. అవసరమైన వాహనాలను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ఉప కమీషనర్ ను ఆదేశించారు. బేలెట్ పేపర్ల పంపిణీలో ఎటువంటి తప్పిదాలు జరగరాదని ఆయన స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసే ప్రదేశాలను ముందుగా తెలియజేయాలని చెప్పారు. వీడియో కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.          ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గరోడా, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్డీఓలు ఐ కిషోర్, టివిఎస్జీ కుమార్, డిపిఓ వి.రవి కుమార్, జెడ్పి సిఇఓ లక్ష్మీపతి, ఎస్డీసిలు బి.శాంతి, కాశీ విశ్వనాథ రావు, పి.అప్పారావు, సిపిఓ ఎమ్.మోహన రావు, డిటిసి డా.వడ్డి సుందర్, డిఆర్డీఏ పిడి బి.శాంతి శ్రీ, హౌసింగ్ పిడి టి.వేణుగోపాల్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి.రజనీకాంత రావు , డివిజనల్ అభివృద్ధి అధికారి ఆర్.వి.రామన్, జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.