మొదటి దశలో 319 పంచాయతీల్లో ఎన్నికలు..
Ens Balu
2
Srikakulam
2021-01-27 17:07:43
శ్రీకాకుళం జిల్లాలో మొదటి దశలో 319 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరుగుటకు అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ (ఎస్.ఇ.సి) ఎన్.రమేష్ కుమార్ ఆదేశించారని తెలిపారు. ప్రతి అంశాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు తగిన భరోసా కల్పించాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. జిల్లాలో ఎన్నికల సిబ్బందికి గురువారం నుంచి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఎక్కడ నామినేషన్లు దాఖలు చేయాలో తెలియజేయడం జరుగుతుందని అన్నారు. పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.