ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి..


Ens Balu
2
Visakhapatnam
2021-01-27 17:15:04

విశాఖ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు వివరించారు. బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్. పి లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్, డిజిపి గౌతమ్ సవాంగ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ గిరిజాశంకర్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్,  ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా లో వ్యాక్సినేషన్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతోందని వివరించారు. విశాఖపట్నం నుంచి నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, రూరల్ ఎస్పీ బి.కృష్ణా రావు, జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, ఆర్. గోవింద రావు, డిఆర్ఓ ఎ.ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ కుమారి, జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జున సాగర్, డిఆర్డీఏ పిడి విశ్వేశ్వర రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.