ఎన్నికలకు నోడల్ అధికారుల నియామకం..


Ens Balu
4
Srikakulam
2021-01-27 19:36:35

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ జె నివాస్ బుధ వారం ఉత్తర్వులు జారీ చేసారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించుటకు సమన్వయకర్తగా విశ్రాంత జాయింట్ కలెక్టర్ పి.రజనీకాంతారావును నియమించగా, మానవ వనరుల నిర్వహణ విభాగానికి జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, సామగ్రి పంపిణీ, శిక్షణా తరగతుల నిర్వహణ సమాచారం అందజేయటకు ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ బి.శాంతి, బ్యాలెట్ పేపర్ నిర్వహణ కార్యక్రమాలను డి.ఆర్.డి.ఓ ప్రాజెక్టు డైరక్టర్ బి.శాంతిశ్రీ, బ్యాలెట్ బాక్సుల నిర్వహణకు జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాస రావు, పోస్టర్ బ్యాలెట్ ల నిర్వహణకు ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ ఎం.అప్పారావు, సామగ్రి సరఫరాకు ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ పి.కాశీవిశ్వనాథ రావు, వాహనాలు సమకూర్చుటకు డిప్యూటి ట్రాన్స్ పోర్టు కమీషనర్ డా.వడ్డి సుందర్, బ్యాలెట్ బాక్సుల పంపిణీ తదితర అవసరాలకు వాహనాల నిర్వహణకు హౌసింగ్ ప్రాజెక్టు డైరక్టర్ టి.వేణుగోపాల్, ఎన్నికల నియమావళి అమలు పరిశీలనకు ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు, ఓటరు జాబితాల సమన్వయానికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి లను నియమించారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ జారీ చేసే ఆదేశాలు, సూచనలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా విధులను నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రవర్తనా నియమావళి అమలు అధికారులుగా తహశీల్దార్లు : పంచాయతీ ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ నివాస్ అన్నారు. ఈ మేరకు మండల స్ధాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పరిశీలనకు తహశీల్దార్లను నియమించారు. పంచాయతీ స్ధాయిలో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాలకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. తహశీల్దార్లు మండలాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలించి రోజు వారీ నివేదికను నోడల్ అధికారి మరియు ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావుకు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ నివేదికలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతి రోజు పంపించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.