మౌళిక సదుపాయాలన్నీ కల్పిస్తాం..
Ens Balu
3
Visakhapatnam
2021-01-27 20:44:34
విశాఖ లో రైల్వే న్యూ కాలనీ ఇందిరానగర్ కాలనీ లో మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పష్టం చేవారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణలతో కలిసి బుధవారం రైల్వే న్యూకాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 76 ఇళ్లకు కావాల్సిన సదుపాయాలకు సంబంధించిన రూ.30 లక్షలతో కూడి అభివ్రుద్ధి పనులకు శంఖుస్థాపన అనంతరం, వివిధ అంశాలపై నేరుగా విజయసాయిరెడ్డి ఈ ప్రాంతీయులతో మాట్లాడారు. భవిష్యత్తు లో ఎటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుందని విజయసాయిరెడ్డి ఈ ప్రాంతీయులకు హామీ ఇచ్చారు. విశాఖలోని నగరవాసుల కష్టాలు మొత్తం తీర్చవిధంగా అభివ్రుద్ధికార్యక్రమాలతోపాటు, మౌళిక వసతులు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఈవిషయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ లు స్వయంగా తన ద్రుష్టికి తీసుకు వచ్చారన్నారు. దీనితో ఇక్కడ మౌళిక వసుతులు కల్పించడానికి ప్రభుత్వం నడుంబిగించిందన్నారు. ఎంపీ mvv సత్యనారాయణ మాట్లాడుతూ, విశాఖలో ఏ ప్రాంత వాసులు ఇబ్బందులు పడకూడదనే ప్రభుత్వ లక్ష్యమని దానికోసమే నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామన్నారు. మత్స్యకార చైర్మన్ కోలా గురువులు , యువజన అధ్యక్షులు రాజీవ్ , స్థానిక వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ళ లీలా శ్రీనివాస్, లీడర్ రమణమూర్తి, శ్రీనుబాబు, కార్పొరేటర్ అభ్యర్థులు, వైసీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.