పూర్తి అవగాహనతోనే ఎన్నికల ప్రక్రియ..
Ens Balu
3
శ్రీకాకుళం
2021-01-27 21:02:15
పూర్తి అవగాహనతో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత మండల అభివృధ్ధి అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ముందుగా బ్యాలట్ బాక్సులను సిధ్ధంగా వుంచుకోవాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్లను నియమించుకుని వార్డువారీగా దాఖలయిన నామిమేషన్ వివరాలను రోజువారీ అప్ లోడ్ చేయాలన్నారు. కులాలవారీగా రిజర్వేషన్ల నిక్కచ్చి వివరాలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు పంపించాలన్నారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్నారు. అభ్యర్ధులకు ఇవ్వవలసిన నిర్ణీత ఫారాలను, ప్రోఫార్మాలను అందించాలన్నారు. పోలింగ్ స్టేషన్లను పరిశీలించుకోవాలన్నారు. ఉదయం 6.30 గం.ల నుండి పోలింగ్ ప్రారంభం కానున్నదన్నారు. నామినేషన్ల అనంతరం విత్ డ్రాయల్స్, స్కూటినీ, రిజెక్షన్లు, అభ్యర్ధుల తుది జాబితాల వివరాల తయారీ తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి వుండాలన్నారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సరిగా చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, రూట్ మేప్ లు పక్కాగా తయారు చేయాలని ఆయన ఆదేశించారు. అవసరమైన వాహనాలను ఏర్పాటు. బేలెట్ పేపర్ల పంపిణీలో ఎటువంటి తప్పిదాలు జరగరాదని ఆయన స్పష్టం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసే ప్రదేశాలను ముందుగా తెలియజేయాలని చెప్పారు. వీడియో కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మొదటి విడతలో పాతపట్నం, టెక్కలి, ఎచ్చెర్ల నియోజక వర్గాలలోని 10 మండలాలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. లావేరు, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మిలియాపుట్టి, ఎల్.ఎన్.పేట, కొటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం మండల పరిథిలలోని 319 గ్రామ పంచాయితీలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, 2902 వార్డులలో, 2940 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల జరగనున్నాయని తెలిపారు. కావున బ్యాలట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, ఓటరు లిస్టులు పక్కాగా వుండాలన్నారు. ఎన్నికలు సజావుగా నిక్కఛ్ఛిగా జరగాలన్నారు. ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహనతో నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, జిల్లా పంచాయితీ అధికారి వి.రవి, మండల అభివృధ్ధి అధికారులు, ఇ.ఓ.పి.ఆర్.ఆర్.డి.లు, తదితరులు పాల్గొన్నారు.