పంచాయతీ ఎన్నికలకు సిద్ధం ఉన్నాం..


Ens Balu
4
Vizianagaram
2021-01-27 21:30:19

విజయనగరం జిల్లాలో  గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం  సిద్దంగా వుందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు తెలిపారు.  బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి.లతో స్థానిక సంస్థ ఎన్నికలపై వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.  విజయనగరం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు అవసరమగు మేన్ పవర్, మెటీరియల్ సిద్దంగా వుందని తెలిపారు.  జిల్లాలో స్థానిక ఎన్నిలకలను మూడు విడతలలో నిర్వహిస్తే బాగుంటుందని ఎన్నికల కమిషనర్ ను కోరారు.  విజయనగరం డివిజన్ లో 19 మండలాలు వున్నాయని,ఈ మండలాలలో రెండు విడతలలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని కోరగా  ప్రతిపాదనలు పంపాలని ఎన్నికల కమిషనర్ తెలిపారు.  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. రాజకుమారి మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు బందోబస్తు ప్రణాళికలను  తయారు చేస్తున్నట్లు తెలిపారు.    ఈ వీడియో కాన్ఫెరెన్సులో  సంయుక్త కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, సబ్ కలెక్టర్ విథేఖర్, సహాయ కలెక్టర్ సింహాచలం, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, ఆర్.డి.ఓ. భవానీశంకర్, డిపిఓ సునీల్ రాజకుమార్, జిల్లా పరిషత్ సిఇఓ వెంకటేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.