ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సహకాలు..
Ens Balu
3
విజయనగరం
2021-01-27 21:32:09
ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం భారీ పారితోషికాలు ప్రకటించిందని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.34 విడుదల చేసిందని, గతంలో కంటే ఆర్థిక నజరానాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 2,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలలో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక జరిగితే రూ.5 లక్షలు, 2001 నుంచి 5000 లోపు జనాభా ఉన్న పంచాయతీలలో ఏకగ్రీవం జరిగితే రూ.10 లక్షలు, 5001 నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలలో ఏకగ్రీవం జరిగితే రూ.15 లక్షలు, 10 వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీలలో ఏకగ్రీవం జరిగితే రూ.20 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం పారితోషికంగా చెల్లిస్తుందని వివరించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు.. ప్రజల్లో ఐక్యతను పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధిపై దృష్టి సారించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలు ప్రకటించిందని పేర్కొన్నారు.