పిల్లలందరికీ పోలీయో చక్కులు వేయాలి..


Ens Balu
3
Visakhapatnam
2021-01-27 21:34:48

విశాఖజిల్లాలోని పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్-2  పి. అరుణ్ బాబు ఆదేశించారు.  బుధవారం తన చాంబర్ లో పోలియో చుక్కలు కార్యక్రమంపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  31వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.  జిల్లాలో 3 వేల 786 పోలింగ్ కేంద్రాలలో 4 లక్షల 81 వేల 517 మంది 0-5 వయసు గల పిల్లలు ఉన్నట్లు చెప్పారు. పోలియో చుక్కలు వేయుటకు సంబంధిత సిబ్బందిన సిద్దం చేసుకొని సిద్దంగా ఉండాలన్నారు.  పిల్లలందరికీ తప్పని సరిగా పోలియో చుక్కలు వేయాలన్నారు.  ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి.యస్. సూర్యనారాయణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. యస్. జీవన్ రాణి, జివియంసి సి.ఎం.ఓ. డా. కె. శాస్త్రి, జిల్లా వైద్య విధాన సమన్వయ కర్త డా. లక్ష్మణరావు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డా. జి. భవాణి, యూనిసెఫ్ డా. విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.