పంచాయతీ ఎన్నికలకు సిద్దం కావాలి..
Ens Balu
4
Chittoor
2021-01-27 21:55:11
చిత్తూరు జిల్లాలో ఈ నెల 29 నుంచి మొదటి విడత గ్రామ సర్పంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని అందుకు అధికారులు అందరూ సన్నద్ధంగా ఉండాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మార్కండేయులు అన్నారు. ఈ నెల 29 న స్టేజ్ 1ఎన్నికల అధికారులుకు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో బుధవారం సాయంత్రం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటిఫికేషన్ ఇవ్వడంతో ప్రారంభమవుతుందని విడుదల చేసే సమయంలో గ్రామస్థుల నుంచి సంతకాలు తీసుకోవాలని, అదేవిధంగా ఎన్నికల నిబంధనల మేరకు నామినేషన్ లు స్వీకరించాలన్నారు.అనంతరం స్క్రూటినీ పకడ్బందీగా నిర్వహించాలని ఆ తర్వాత ఎవరైనా ఉపసంహరణలు కార్యక్రమం పూర్తి అయిన అనంతరం రంగంలో ఉన్న వారి జాబితాను ప్రదర్శించాలని అన్నారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మేరకు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తూ వారి గుర్తులను తెలిసేవిధంగా డిస్ప్లే చేయడంతోపాటు అభ్యర్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎన్నికల కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి ఇ నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైనా చేతిలో జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గతంలో జరిగిన ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలలో ఏకగ్రీవం జరిగిన మండలాలలో విధులు నిర్వహించిన రిటర్నింగ్ అధికారులకు ఈ ఎన్నికలలో ఇటువంటివి విధులు ఆలాట్ చేయకూడదని ఆయన అన్నారు. జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిష్పక్షపాతంగా ఇలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా నిర్వహించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి దశరధ రాంరెడ్డి మాట్లాడుతూ చిత్తూరు డివిజన్ పరిధిలో 98 మంది స్టేజ్ 1 అధికారులు కావాల్సి ఉండగా 115 మంది నీ ఎంపిక చేశారని ఇప్పటికే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయిందని ఓటర్ లిస్టు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా దీనికి సంబంధించి జోనల్ ఆఫీసర్ లను అబ్జర్వర్లును వెబ్ కాస్టింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. పోలీసు రెవెన్యూ అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడంతో పాటు పోలింగ్ స్టేషన్లను మొదట చూసుకోవాలని కోరారు. కొన్ని పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలంటే సంఖ్య పెంచకుండా స్టేజి 2 అధికారులైనఎం డి ఓ తాసిల్దార్ లకు సమాచారం ఇచ్చి మార్చుకోవాలన్నారు ఈ సమాచారాన్ని డివిజన్ స్థాయిలో డిప్యూటీ ఎన్నికల అధికారికి జిల్లా ఎన్నికల అధికారి కూడా సమాచారం ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మార్కండేయులు, జడ్పీ సీఈవో ప్రభాకర రెడ్డి ,డి పి ఓ దశరథ రామి రెడ్డి,ఆర్ డి ఓ రేణుక ,డీఎల్ పి ఓ రూప వాణి, ఎన్నికలకు సంబంధించి న స్టేజి 1 అధికారులు పాల్గొన్నారు