సీఎం వైఎస్ జగన్ ద్రుష్టికి జర్నలిస్టు సమస్యలు..
Ens Balu
3
Visakhapatnam
2021-01-28 12:08:29
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ద్రుష్టికి వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళతానని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యన్నారాయణ పేర్కొన్నారు. గురువారం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్టు ప్రతినిధులు జర్నలిస్టుల సమస్యలపై ఎంపీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు వచ్చేలా తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వున్న సమస్యల పరిష్కారానికి కూడా క్రుషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన వినతిని, ప్రస్తావించిన సమస్యలను ఎంపీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో జర్నలిస్టులు కీలకంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రజాప్రతినిధిగా తనపై ఉందని అన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించే విషయంలో తోడుంటానని బరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ పెద్దలంతా ఎంతో సముఖుంగా ఉన్నారని ఎంవీవీకి వివరించారు. ముఖ్యంగా జర్నలిస్టులకు గృహ వసతి, భీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి పద్మజ, ప్రభాకర్, సూర్య, మాధవి, జుబేర్, దేవిశ్రీ, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.