స్నేహపూరిత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు..


Ens Balu
5
Chittoor
2021-01-28 18:29:42

గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్. (పూ.అ.భా) డి. మార్కండే యులు పేర్కొ న్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మం దిరంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ సెంథిల్ కుమార్ తో కలిసి జిల్లాలోని పోలీసు సబ్ డివిజన్ డి.ఎస్.పి లతో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ (అభి వృద్ధి) వి. వీర బ్రహ్మం, మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, తిరుపతి అడిషనల్ ఎస్పీ సుప్రజా, చిత్తూరు తిరుపతి రేణుక, కనక నరసారెడ్డి, చిత్తూరు సబ్ డివిజన్ సుధాకర్ రెడ్డి, పలమనేర్ సబ్ డివిజన్ గంగయ్య, మదనపల్లి రవి మనోహర్ ఆచారి, పుత్తూరు యశ్వంత్,డి పి ఓ దశరధ రా మి రెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి లు పాల్గొన్నారు... ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్ని కల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసుశాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈనెల 29వ తేదీ నుండి మొదటి విడతలో చిత్తూరు డివిజన్ లో, రెండవ,మూడవ విడత లలో మదనపల్లి డివిజన్, నాల్గవ విడత లో తిరుపతి డివిజన్ లో ఎన్నికలు జరుగు తాయని తెలి పారు.. చిత్తూరు డివిజన్ లోని ఇరవై మండలాలకు ఈనెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు... మదనపల్లి డివిజన్ రెండవ విడత లో బి.కొత్తకోట,చిన్న గొట్టి గల్లు, గుర్రంకొండ, కె.వి. పల్లి, కలకడ, కలికిరి, కురబల కోట,మదనపల్లి, ములకల చెరువు, నిమ్మనపల్లి,పి.టి. యం,పెద్ద మండ్యం, పీలేరు, రామసముద్రం తంబళ్లపల్లి, వాల్మీకిపురం, ఎర్ర వారి పాలెం మొత్తం 17 మండలా ల్లో... మూడవ విడతలో బైరెడ్డిపల్లి, చౌడే పల్లి, గంగవరం, గుడిపల్లి కుప్పం, పలమనేరు, పెద్ద పంజాణి, పుంగనూరు, రామకుప్పం, రొంపిచర్ల, శాంతిపురం,సదుం, సోమల వి.కోట మొత్తం 14 మండ లాల్లో జరుగునని, నాలుగో విడత లో తిరుపతి డివిజన్ కు సంబంధించి 14 మండ లాలలో ఎన్నికలు నిర్వహణ జరగనున్నాయని తెలిపారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయిలో పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు ఎంపీడీవో, తహశీల్దార్ లతో సమన్వయం చేసుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయాలని చిత్తూరు డివిజన్ సంబంధించి ఈ నెల 29 నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందుగా నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాల్లో పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు, నామినేషన్ వేసేందుకు అభ్యర్థి తో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించాలని తెలిపారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మండల స్థాయి అధికారుల తో సమన్వయంతో పని చేయాలని సూచించారు.