కలెక్టరేట్ లో ఎన్నికల కంట్రోల్ రూమ్..
Ens Balu
2
శ్రీకాకుళం
2021-01-30 19:14:06
పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిర్యాధులు స్వీకరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన జారీ చేస్తూ రేయింబవళ్ళు పని చేసే కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించామన్నారు. కంట్రోల్ రూమ్ లో సిబ్బంది మూడు షిప్టులలో పనిచేస్తారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల పిర్యాధులను 08942 240605, 08942 240606 ఫోన్ నంబర్లకు తెలియజేయవచ్చని సూచించారు. కంట్రోల్ రూమ్ లో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పి.జగ్గారావు (8790446164), కె.భరద్వాజ చౌదరి (9550311645)., మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎస్.రమేష్ (9100314196), జె.గోపా (9440968844)., రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎన్.అఖిల్ (7989788135), ఎన్.లోహిత్ కుమార్ (8341569944) విధుల్లో ఉంటారని ఆయన తెలిపారు. ప్రజల నుండి వచ్చే పిర్యాధులను స్వీకరించి వాటిని రిజిస్టర్ లో నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశించినట్లు ఆయన చెప్పారు. పిర్యాధుల తక్షణ పరిష్కారానికి సంబంధిత తహశీల్దార్, ఎంపిడిఓ, ఎం.సి.సి , ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర బృందాలకు సమాచారం అందించాలని ఆయన సిబ్బందికి ఆదేశించారు.