వివక్షతే దేశాభివ్రుద్ధికి ఆటంకం..


Ens Balu
4
Andhra University
2021-01-30 19:15:48

వివక్షత, వేర్పాటు విధానాలు అభివృద్ధికి నిరోధకాలుగా నిలుస్తాయని ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ అన్నారు. శనివారం ఉదయం ఏయూ సెంటర్‌ ‌ఫర్‌ ‌సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ ఇం‌క్లూజివ్‌ ‌పాలసీ(సిఎస్‌ఎస్‌ఇఐపి) నిర్వహించిన వెబినార్‌ ‘ ‌రిలిజియస్‌ ‌మైనారిటీస్‌-ఐడెంటిటీ, సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అం‌డ్‌ ఇం‌క్లూజన్‌’‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వివక్షతను ఏ స్థాయిలోను ఉపేక్షించడం సరికాదన్నారు. కులం, మతం, లింగం, ప్రాంతీయత ఆధారంగా వ్యక్తులను వేరుచేయడం సమర్ధనీయం కాదని, ఇది దేశ అభివృద్ధికి విఘాతంగా మారుతుందన్నారు. సమాజంలో అందరినీ మిళితం చేస్తూ, సమాన అవకాశాలు కల్పించడం ఎంతో అవసరమన్నారు. న్యాయవాది జాహా ఆరా మాట్లాడుతూ ప్రజాస్వామ్య సూత్రాలను అనుసరిస్తూ పూర్తిస్థాయిలో సమానత్వాన్ని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్రం సంచాలకులు ఆచార్య పి.సుబ్బారావు తదితరులు ప్రసంగించారు.