ఏయూతో వైఎంసిఏ ఎంఓయూ..
Ens Balu
10
Andhra University
2021-01-30 19:17:22
ఆంధ్రవిశ్వవిద్యాలయంతో వైఎంసిఏ అవగాహన ఒప్పందం చేసుకుంది. శనివారం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, వైఎంసిఏ అద్యక్షులు మేథ్యూ పీటర్‌లు సంతకాలు చేశారు. అనంతరం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యిందన్నారు. 20కి పైగా దేశాలకు చెందిన విద్యార్థులకు వర్సిటీలో విద్యను అభ్యశించడం జరుగుతోందన్నారు. దీనికి అనుగుణంగా వీరికి అవసరమైన వసతి కల్పనకు వైఎంసిఏ ముందుకు వచ్చిందన్నారు. విద్యార్థులకు పూర్తిస్తాయిలో వసతులను కల్పిస్తుందన్నారు.వర్సిటీలో పెరుగుతున్న విదేశీ విద్యార్థులకు అనుగుణంగా నూతన హాస్టల్స్ నిర్మాణం జరుపుతామన్నారు.
వైఎంసిఏ అంతర్జాతీయ సభ్యులు రోలండ్ విలియమ్స్ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం రెండు సంస్థలకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం వర్సిటీలో చేరిన 60 మంది విదేశీ విద్యార్థులకు వసతి కల్పించే దిశగా 30 గదులను సేవాభావంతో నామమాత్రపు రుసుముతో అందిస్తున్నామన్నారు.విద్యార్థులకు వసతి, జిమ్, వైఫై సదుపాయం, టీవీ రూం, కిచెన్, వాషింగ్ మెషీన్స్, సెక్యూరిటీ పర్యవేక్షణ కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయ రావు, వైఎంసిఏ డైరక్టర్లు ఇజ్రాయిల్, ప్రకాష్ బెన్హా, అంతర్జాతీయ విద్యార్థుల హాస్టల్స్ చీఫ్ వార్డెన్ ఆచార్య పాల్ డగ్లస్ తదితరులు పాల్గొన్నారు.