అహింసామూర్తికి ఘన నివాళి..
Ens Balu
2
Visakhapatnam
2021-01-30 19:18:39
జాతిపిత, అహింసామూర్తి మహాత్మగాంధీ వర్ధంతిని శనివారం ఉదయం ఏయూలో నిర్వహించారు. ఏయూ పరిపాలనా భవనం వద్దనున్న మహాత్మగాంధీ విగ్రహానికి వర్సిటీ అధికారులు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఐక్యత, సమగ్రత, సమిష్టితత్వం గాంధీజీ నుంచి నేర్చుకోవాలన్నారు. దేశాన్ని ఏకం చేస్తూ స్వాతంత్య్ర పోరాటం జరిపిన విధానం నిరుపమానమన్నారు. ప్రపంచానికి సత్యం, అహింసల శక్తిని చాటిన మహనీయునిగా మహాత్మగాంధీ నిలుస్తారన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ప్రిన్సిపాల్స్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఆచార్య ఎస్.సుమిత్ర, ఆచార్య వై.రాజేంద్ర ప్రసాద్, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, డీన్‌లు సి.హెచ్ పాండు రంగా రెడ్డి, టి.షారోన్ రాజు, ప్రవేశాల సంచాలకులు ఆచార్య నాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త ఆచార్య ఎస్.హరనాథ్, చీఫ్ ఇంజనీర్ ఆర్.శంకర రావు తదితరులు పాల్గొన్నారు.