ఆచార్య గంగారావు పదవీ విరమణ..


Ens Balu
2
Andhra University
2021-01-30 19:31:40

 ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫార్మశీ కళాశాల ఆచార్యులు బట్టు గంగారావు ఉద్యోగ విరమణ అనంతరం ఆయన శేష జీవితం ఎంతో బాగా గడవాలని ఏయూ వీసి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఆయన విరమణ సందర్భంగా తన చాంబర్ లో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం వీసి మాట్లాడుతూ, ఫార్మశీ ఆచార్యునిగా ఉన్నసమయంలో యూనివర్శిటీకి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఒకరంగా అలాంటి ఆచార్యులు ఉద్యోగ విరమణ చేయడం బాధకలిగించినా విధినిర్వహణలో ఏ ఉద్యోగికైనా అది తప్పదన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ‌ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య రాజేంద్ర ప్రసాద్‌, ‌పాలక మండలి సభ్యురాలు ఆచార్య క్రిష్ణమంజరి పవార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.