నైపుణ్యానికి పునాదులు ప్రయోగశాలలు..
Ens Balu
2
Visakhapatnam
2021-01-30 20:46:09
పాఠశాల స్థాయిలో ప్రయోగశాలలు విద్యార్ధుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు అన్నారు. శనివారం మహా విశాఖ నగరపాలక సంస్థ 45వ వార్డు గాంధీగ్రాం లోని జివిఎంసి ఉన్నత పాఠశాలలో కోరమండల్ ఫెర్టిలైజెర్స్ ఆర్ధిక సహాయంతో నిర్మించిన సైన్స్ ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోరమండల్ ఫెర్టిలైజర్స్ యాజమాన్యం వారు పాఠశాలలోని సైన్స్ ప్రయోగశాల నిర్మాణం కొరకు రూ.5.35లక్షలు మంజూరు చేసారని, ఆ నిధులతో సైన్స్ ప్రయోగశాలని నెలకొల్పమన్నారు. అందుకు కోరమండల్ ఫెర్టిలైజర్స్ మానవ వనరుల విభాగపు ప్రధాన అధికారి కె. రంగ కుమార్ మరియు ఫైనాన్స్ ప్రధాన అధికారి జె. మహేష్ వారికి అదనపు కమిషనర్ జివిఎంసి కమిషనర్ తరుపున అభినందనలు తెలిపారు. ఈ సందర్భంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ మానవ వనరుల విభాగపు ప్రధాన అధికారి కె. రంగ కుమార్, ఫైనాన్స్ ప్రధాన అధికారి జె. మహేష్, జివిఎంసి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.