ఫిబ్రవరి 1 న ఈసీ కమిషనర్ జిల్లాకు రాక..
Ens Balu
1
Srikakulam
2021-01-30 21:02:50
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన విజయవాడ నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారని, అక్కడ నుండి అదే రోజు బయలుదేరి మధ్యాహ్నం 3.45 గం.లకు శ్రీకాకుళం చేరుకుంటారని తెలిపారు. జిల్లా కలెక్టర్, జాయంట్ కలెక్టర్లు, ఎస్.పి, అడిషనల్ ఎస్.పి.లు, డి.ఎస్.పి.లు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ, డిప్యూటీ సి.ఇ.ఓ, ఆర్.డి.ఓ.లు, జల్లా పంచాయితీ అధికారి, తదితర అధికారులతో పంచాయితీ ఎన్నికల ప్రక్రియపై సాయంత్రం 4.00 గం.ల నుండి 5.30 గం.ల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీకాకుళం నుండి బయలుదేరి విజయనగరం వెళ్తారని జిల్లా కలెక్టర్ వివరించారు.