డీజిల్,పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి..
Ens Balu
3
Visakhapatnam
2021-02-01 14:15:38
కేంద్ర ప్రభుత్వం డీజిల్ ,పెట్రోల్ ధరలను జిఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీతమ్మదార జంక్షన్ అల్లూరి విగ్రహం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పడాల రమణ ,ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి లు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీజిల్, పెట్రోల్,వంట గ్యాస్ ధరలు పెరగడం తప్పా తరగడం కనిపించలేదున్నారు. చమురు ధరలను జిఎస్టీ పరిధిలోకి రావడం ద్వారా రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరిగి నిత్యవసర సరుకు ధరలైనా తగ్గుతాయని అభిప్రాయ పడ్డారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్ ,పెట్రోల్ ధరలపై వ్యాట్, సెస్ పన్నులను డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ 20 లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు వేశారని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో దశలవారీ ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంపీలు,మంత్రులు ధరలు పెరుగుతున్న వారికి పట్టనట్టు వ్యవరించడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పెరుగుతున్న ధరల పై ప్రజలు ప్రతి ఘటనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పడాల గోవిందు, ఎన్.మధు రెడ్డి ,లంక గోవింద్ ,రావి కృష్ణ ,కెల్లా రమణ ,వెంకట్రావు ,జగన్నాథం ,తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.