రేపు శ్రీకాకుళంలో ఉచిత వైద్య శిబిరం..


Ens Balu
6
శ్రీకాకుళం
2021-02-01 17:48:27

రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు  రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు టి.వీరభద్రస్వామి సోమవారం తెలిపారు. రాగోలులోని జెమ్స్ ఆసుపత్రి వారి సౌజన్యంతో  వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.  గుండె, కిడ్నీ, కంటికి సంబంధించిన వ్యాధులకు జెమ్స్ ఆసుపత్రిలోని వైద్య నిపుణులుచే వైద్య పరీక్షలను ఈ శబిరంలో నిర్వహిస్తారని తెలిపారు.  కిన్నెర థియేటర్ ఎదురుగా వున్న జెమ్స్ అర్బన్ హెల్త్ సెంటర్ లో ఉదయం 9 గం.ల నుండి మధ్యాహ్నం 1.00 గం. వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని,   కార్డియాలజీ స్పెషలిస్టు డా.నాగ చైతన్య, ఆప్తమాలజిస్టు అండ్ రెటీనా స్పెషలిస్టు  డా.దినేష్ కుమార్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డా.భానుమూర్తి లు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఈ.హెచ్.ఎస్.పథకం ద్వారా అర్హులైన వారికి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయడం జరుగుతుందని,  కంటి శుక్లాలకు ఆధునిక పధ్ధతిలో ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు.  ఉచిత రవాణా మరియు భోజన సౌకర్యాలను జెమ్స్ ఆసుపత్రి వారు ఏర్పాటు చేస్తారని తెలిపారు.  ఈ అవకాశాన్ని  రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, వినియోగించుకోవలసినదిగా విశ్రాంత ఉద్యోగుల జిల్లా ప్రెసిడెంటు టి.వీరభద్రస్వామి మరియు సెక్రటరీ పి.నరసింహమూర్తి కోరారు.