నా జీవితం ప్రజాసేకే అంకితం..వాసుపల్లి


Ens Balu
1
Visakhapatnam
2021-02-01 20:21:15

ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సోమవారం వాసుపల్లి జన్మదినోత్సవ వేడుకలు వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబంలో అట్టహాసంగా జరిగాయి. 29 వార్డులో వైస్సార్సీపీ స్టేట్ యూత్ సెక్రటరీ మాన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో ఎమ్మెల్యే భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైఎస్సార్ అంటే ప్రజల్లో చెరగని ముద్రవుందని, ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ సారధ్యంలో పనిచేస్తూ, ప్రజాసేకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. దానికోసం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సీఎం వైఎస్ జగన్ బాటలోనే నడుస్తానని అన్నారు. తనను నమ్ముకున్న ఎవరికీ అన్యాయం జరగకుంగా నియోజవర్గం అభివ్రుద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని కార్యకర్తలకు నాయకులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి కార్యకర్తలు, అభిమానులు గజమాలతో సత్కరించారు.  వైస్సార్సీపీ సీనియర్ నాయకులు జాన్ వెస్లీ, వార్డ్ ప్రెసిడెంట్, కార్పోరేటర్ అభ్యర్థి, బీసీ డైరెక్టర్లు,  వార్డు సీనియర్ నాయకులు, వార్డు బూత్ ప్రెసిడెంట్ లు, వార్డు అనుబంధ సంఘ ప్రెసిడెంట్ లు తదితరులు పాల్గొన్నారు.