గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు..


Ens Balu
2
Srikakulam
2021-02-01 20:26:01

శ్రీకాకుళం జిల్లాలోని పంచాయతీ ఎన్నికల మొదటి దశ (స్టేజ్ -1) రిటర్నింగు అధికారుల శిక్షణకు హాజరు కాని అధికారులకు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ షోకాజ్ నోటీసు జారీ చేసారు. ఈ మేరకు సోమ వారం షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ మూడు రోజులలో సంజాయిషీ సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల నియమ నిబంధనలు, సిసిఏ నిబంధనల క్రింద క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించాలని ఆయా ఉపాధ్యాయులకు తెలిసినప్పటికి నిర్లక్ష్య ధోరణి అవలంభించి  స్టేజ్ – 1 రిటర్నింగు అధికారులు, సహాయ రిటర్నింగు అధికాల శిక్షణా తరగతులకు హాజరు కాలేదని ఆయన అన్నారు.  షోకాజ్ నోటీసులు జారీ చేసిన వారిలో రిటర్నింగు అధికారులుగా నియమితులైన మందస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రేడ్ – 2 ప్రధానోపాధ్యాయులు ఎం.భాస్కర రావు, ఇచ్ఛాపురం సబ్ రిజిస్ట్రార్ వెలమల తులసీదాస్, సహాయ రిటర్నింగు అధికారులు భామిని మండలం మనుమకొండ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు జి.భాస్కర రావు, చిన్నబగ్గ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కె.ఆనంద్, రాజాం మండలం కంచరాం ఎస్.సి కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరిచర్ల గంగారావు ఉన్నారు.