మహానాయకుడు దివంగత డి.శ్రీనివాస్..


Ens Balu
2
Visakhapatnam
2021-02-01 20:32:36

రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే మహా నాయకుడు  ద్రోణంరాజు శ్రీనివాస్ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. సోవారం దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్ 60వ జయంతిని పురస్కరించుకొని ఆయన తనయుడు శ్రీవాస్తవ జిల్లా పరిషత్ కూడలి అంకోసా హల్ లో మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయే మంచి మనసున్న వ్యక్తి ద్రోణంరాజు శ్రీనివాస్ అని కొనియాడారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే ద్రోణంరాజు శ్రీనివాస్ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. శ్రీవాస్తవ మాట్లాడుతూ తన తండ్రి షష్టిపూర్తి మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని భావించామని, అయితే ఆయన అకాల మరణం దుఃఖాన్ని మిగిలించిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రతి ఏడాది ఆయన జయంతి రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నది తమ ఆకాంక్షగా చెప్పారు.  ఈ శిబిరంలో సుమారు 200 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తైనాల విజయకుమార్ వైసిపి నాయకులు పక్కి దివాకర్, రవిరెడ్డి, ఉడారవి, బాణాల శ్రీనివాస్, చరణ్ , వంకాయలో తాతాజీ,  కు౦టు ముచ్చు తాతారావు,మాజీ కార్పొరేటర్ సాయిలక్ష్మి ,హేమలత  దాడి సత్యనారాయణ, కొండ రాజీవ్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.