పోటీ ప్రజాస్వామ్యానికి బలాన్నిస్తుంది..


Ens Balu
2
Visakhapatnam
2021-02-02 14:02:20

స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు భద్రతా చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. విశాఖ   జిల్లాలో ప్రతిభావంతులైన అధికారులు ఉన్నారని సంపూర్ణ అవగాహనతో ఎన్నికల నిర్వహణకు ప్రాముఖ్యత ఇస్తున్నారని ప్రశంసించారు.  ఆదర్శవంతమైన పరిపాలన సంస్కరణలు కావాలన్నారుఅయితే జిల్లాలో పోలింగ్ శాతం మెరుగవ్వాలన్నారు. గతంలో రాష్ట్రంలో 85 శాతం పోలింగ్ వుంటే విశాఖ జిల్లాలో 75 శాతం పోలింగ్ జరగడం గమనించాలన్నారు. జిల్లాలో పోలింగ్ శాతం పెరిగేందుకు అధికారులు, ప్రజాస్వామ్య వాదులు కృషి చేయాలన్నారు. ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటర్లను పాల్గొనేలా చేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఓటు వేసి ప్రజాస్వావమ్యాన్ని బలోపేతం చేయాలన్నారు. రాజ్యాంగం చెప్పిందే ఎలక్షన్ కమిషన్ చెబుతోందని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగ వ్యవస్థకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయని తెలియజేశారు. వోటు హక్కు వినియోగించు కునేందుకే పోలింగ్ రోజు శలవు ప్రకటిస్తారని గమనించాలన్నారు.  గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటింగ్ సమయం పెంచామని ఉదయం గం. 6:30 నుండి మధ్యాహ్నం గం.3 30ల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రతి పౌరుడు ఓటు చేసే విధంగా మంచి వాతావరణం కల్పించాలన్నారు.  అన్నిరాజకీయ పార్టీలకు, అభ్యర్ధులకు  సమాన అవకాశాలు కల్పిస్తామని ఏ పార్టీని కించపరచడం జరుగదన్నారు. అందరిపట్ల సమభావం, సమన్యాయం, సమదృష్టితో చూస్తామని వెల్లడించారు. ఏకగ్రీవాలకు కమిషన్ వ్యతిరేకం కాదని గతంలోనూ అటువంటివి జరిగాయన్నారు. అయితే ఎక్కువ శాతం ఏకగ్రీవాలు ప్రజా స్వామ్య స్పూర్తిని బలహీన పరుస్తాయన్నారు.  భారతదేశంలో  భిన్నత్వంలో ఏకత్వమే ప్రజాస్వామ్యం అని అభివర్ణించారు. బడుగు బలహీన వర్గాలు సామాజికంగా ఎదగడానికి ఎన్నికలు దోహదపడతాయన్నారు. మహిళలతో పాటు అన్ని వర్గాల వారికి నాయకత్వ లక్షణాలు పెంపొందాలన్నారు. ఈ నెల 3వ తేదీన ఎన్నికల కమిషన్ లో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ నిఘా వ్యవస్థ తో పాటు మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలన్నారు. మీడియా ఒక బలమైన శక్తి అని చెప్తూ ప్రెస్ లో  తులనాత్మక,  విశ్లేషణాత్మక వార్తలు, కథనాలు రావాలన్నారు. మృతుని ఇంటికి ముందుగా వెళతా ఈ సమావేశంలో  ఎన్నికల పరిశీలకులు  ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్, డి.ఐ.జి.రంగారావు,  పోలీసు కమిషనరు మనీష్ కుమార్, ఎస్.పి.  బి.కృష్ణారావు పాల్గొన్నారు.