వర్శిటీ ప్రగతికి తమవంతు సహకారం..
Ens Balu
2
ఆంధ్ర యూనివర్శిటీ
2021-02-03 22:13:20
ఆంధ్రవిశ్వవిద్యాలయం వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో దళిత సంఘాల నాయకులు బుధవారం సమావేశమయ్యారు. ముందుగా ఏయూకు వీసీగా నియమితులు కావడం పట్ల హర్షం వ్యక్తం చేసి వీసీ ప్రసాద రెడ్డిని సత్కరించారు. విశ్వవిద్యాలయంలో దళిత, బడుగు, బలహీన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగే దిశగా కృషిచేయాలని కోరారు. విశ్వవిద్యాలయం ప్రగతికి తమవంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాల మహానాడు వ్యవస్థాపకులు కె.బి.ఆర్ అంబేద్కర్, ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గంజి చింతయ్య, దళిత లిబరేషన్ ఆర్గనైజేషన్ ఉత్తరాంధ్ర జిల్లా కార్యదర్శి బుంగ రాజు, రమాబాయి అంబేద్కర్ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అద్యక్షుడు ఎన్.రమణ, ఎస్సీ సంక్షేమ సంఘం విశాఖ అర్బన్ అద్యక్షులు అద్దల జనార్ధన రావు, ఆచార్య ఎన్.ఏ.డి పాల్ తదితరులు పాల్గొన్నారు.