స్వేచ్ఛాయుతంగా పంచాయతీ ఎన్నికలు..


Ens Balu
4
Tirupati
2021-02-03 22:43:59

స్వేచ్చా యుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం  చర్యలు చేపట్టా లని రాష్ట్ర ఎన్నికల కమి షనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి తిరుపతి ఎస్.వి.యూనివర్సిటీ సెనేట్ హాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు - 2021 లకు సంబందించి సన్నద్దత నిర్వహణలపై జిల్లా ఎన్ని కల పరిశీలకులు సిద్దార్థ జైన్, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం.హరినారాయణన్, అనంత పురం రేంజ్ డి.ఐ.జి క్రాంతి రాణా టాటా, చిత్తూరు, తిరుపతి ఎస్.పి లు సెంథిల్ కుమార్,వెంకట అప్పలనాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ లు (రెవెన్యూ, అభివృద్ది) డి.మార్కండేయులు, వి.వీరబ్రహ్మం,మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, ట్రైని కలెక్టర్ విష్ణు చరణ్, తిరు పతి ఆర్.డి.ఓ కనక నర్సా రెడ్డి,డి.పి.ఓ దశరథ రామి రెడ్డి,నోడల్ అధికారులు, డి.ఎస్.పి లు, సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సంధర్భంగా రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ మాట్లాడు తూ స్వేచ్చయుత వాతా వరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేంధుకు అధికారులందరూ సమన్వ యంతో పని చేయాలని ఓటు హక్కును ప్రజలు వినియోగించుకునేలా విధంగా అవగాహన చేపట్టాలని తెలిపారు. ఓటింగ్ శాతం పెరగాలని తద్వారా మెరుగైన సమా జంనకు అవకాశం  ఏర్పడు తుందని ఈ దిశగా అధికా రులు కృషి చేయాలన్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో జరిగే ఎన్నికల నిర్వహణకు సంబందించి తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వివరించారు.