విభాగాల నిర్వహణ సక్రమంగా ఉండాలి..


Ens Balu
3
Andhra University
2021-02-04 18:01:41

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్టస్ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పి.రాజేంద్ర కర్మార్కర్‌ ‌గురువారం కళాశాల పరిధిలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. ఉదయం ఆయన సోషల్‌ ‌సైన్సెస్‌ ‌భవనంలోని షోషియాలజీ, సోషల్‌ ‌వర్క్, ‌జర్నలిజం, థియేటర్‌ ఆర్టస్, ‌సంగీతం, జపాన్‌ ఇన్ఫర్మేషన్‌ ‌సెంటర్‌ ‌విభాగాలను తనిఖీ చేశారు. ఆచార్యులు, పరిశోధకులు, సిబ్బంది హాజరు పట్టికలు పరిశీలించారు. ఆచార్యులు సెలవుపై వెళ్లిన సందర్భంలో విద్యార్థులకు మరొక ఆచార్యులు పాఠం చెప్పే విధంగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. తరగతుల నిర్వహణ పటిష్టంగా జరగాలని తెలిపారు. విద్యార్థులు నిత్యం తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. తరగతుల నిర్వహణ, సిలబస్‌, ‌కాలపట్టిక వంటివి పరిశీలించారు. విభాగాలలో అందిస్తున్న కోర్సులు, తరగతుల నిర్వహణ తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సైతం వర్సిటీ వసతులను, ఆచార్యుల నిపుణతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. విశ్వవిద్యాలయంలో ఉన్న పూర్తి కాలాన్ని జ్ఞాన సముపార్జనకు, ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగించుకోవాలన్నారు.