జెఎల్‌కు ఎంపికైన విద్యార్థులకు అభినందన..
Ens Balu
2
Andhra University
2021-02-04 18:06:45
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్టస్ కళాశాల పరిధిలోని తెలుగు విభాగంకు చెందిన ఆరుగురు పరిశోధకులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జూనియర్ లెక్చరర్(జెఎల్) ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 ఉద్యోగాలు భర్తీ చేయగా, వీరిలో 6గురు ఏయూ నుంచి ఎంపిక కావడం గర్వకారణం. ఈ సందర్భంగా జెఎల్‌గా ఎంపికైన విద్యార్థులను తెలుగు విభాగంలో ఉదయం సత్కరించారు. విద్యార్థులు తమ ప్రతిభతో ఉపాధి అవకాశాలను పొందడం పట్ల విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. జెల్‌గా ఎంపికైన విద్యార్థులు ఎస్.రమణ, ఎల్.ప్రశాంత్, టి.మానస కుమారి, డాక్టర్ ఎన్.శివ కుమార్, ఏ. సాయిరాం, పి.రాజేశ్వర రావులను అభినందించారు.