ఉపాది శిక్షణ సద్వినియోగం చేసుకోండి..
Ens Balu
4
Kakinada
2021-02-04 18:19:04
ఉపాది లభించే కోర్సులను నిరుద్యోగ యువత పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జెసి జి.రాజకుమారి అన్నారు. గురువారం తూర్పు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బోట్ క్లబ్ ఏరియా లోగల ప్రధాన మంత్రి కౌశల కేంద్రాన్ని జెసి సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్ నందు జరిగే శిక్షణా కార్యక్రమాలు సమీక్షించి ఆటోమోటివ్ టూ అండ్ త్రీ వీలర్స్ టెక్నీషియన్ మరియు రూమ్ అటెండెంట్ శిక్షణార్థులు తో శిక్షణ వివరాలు, వాటి ఉపయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ శిక్షణను ఎలా ఉపయోగించుకోవాలో వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఢి. హరీష్ శేషు మరియు ఇ. సి. ఏ. ఏడ్యూ స్కిల్స్ ఫ్యాకల్టీ మరియు ఇతరు సిబ్బంది పాల్గొన్నారు.