కర్మాగాలరాశాఖ ఉద్యోగినిపై వేటు పడింది..
Ens Balu
1
Srikakulam
2021-02-05 14:05:24
శ్రీకాకుళం జిల్లాలోని కర్మాగారాల శాఖ కార్యాలయ ఉద్యోగినిపై సస్పూండ్ వేటు పడిండి. ఈ మేరకు జిల్లా కర్మాగారశాఖ డైరెక్టర్ డైరక్టర్ డి.చంద్రశేఖర వర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. తనిఖీ కార్యాలయంలో (Inspector of Factories) సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న బి.కుసుమ కుమారి కార్యాలయంలో చేసిన అవకతవలు నిగ్గుతేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విధినిర్వహణలో అలసత్వం కారణంగానే ఆమెను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి సి.సి. కెమేరా ఫుటేజీ ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు. అంతేకాకుండా ఈమెవచ్చిన అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ చేసి క్రమశిక్షణా చర్యలలో భాగంగా ఆమెను సస్పెండ్ చేసినట్లు డైరక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.