రెవిన్యూ సిబ్బందికి కలెక్టరేట్ లో కోవిడ్ వాక్సిన్..
Ens Balu
1
Vizianagaram
2021-02-05 14:28:22
కోవిడ్ వాక్సిన్ లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన కలెక్టరేట్ పరిధి లోగల రెవిన్యూ సిబ్బందికి శుక్రవారం కో వాక్సిన్ టీకా వేసారు. సంయుక్త కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, పలు సెక్షన్లకు చెందిన సిబ్బందికి కల్లెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖా దికారి డా. ఎస్.వి. రమణ కుమారి పర్యవేక్షణ లో ఈ టీకా వేసారు. ముందుగానే ఆన్లైన్ ద్వార సంబంధిత వెబ్సైటు నందు రెవిన్యూ అధికారుల, సిబ్బంది పేర్లన్నీ నమోదు చేసుకోవడం జరిగిందని , అందుకు సంబంధించిన పత్రాలను నింపి సంతకాలు తీసుకున్నారు. టీకా వేసిన తర్వాత అర్ధ గంట వరకు అబ్సర్వేషన్ గదిలో ఉంచారు. అనంతరం వైద్య సిబ్బంది బి.పి ,పల్స్ అక్షీ మీటర్ తో పల్స్ రేట్ ను తనిఖీ చేసిన అంతా నార్మల్ గా ఉండడం తో పంపించారు. టీకా తీసుకున్న తర్వాత తన శరీరం లో ఎలాంటి మార్పులు కనపడలేదని, అంత సాధారణంగానే ఉందని సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు రెవిన్యూ సిబ్బంది అందరకు టీకా వేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తెలిపారు.