మొక్క‌ల పెంప‌కంతో ఆయ‌ష్షు పెరుగుతుంది..


Ens Balu
1
Vizianagaram
2021-02-05 14:29:40

మొక్క‌ల పెంప‌కంతో ప‌ర్యావ‌రణంలో ఆక్సిజ‌న్ స్థాయి పెరుగుతుంద‌ని.. త‌ద్వారా మన ఆయ‌ష్షు పెరుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామంలోని శివరాం సాగరం చెరువు, జగ్గు గుప్తవాణి చెరువుల వ‌ద్ద శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ అప‌రిశుభ్ర‌తే అనారోగ్యానికి కార‌ణ‌మ‌ని, మ‌న ఇంటినే కాకుండా మ‌న గ్రామాన్నికూడా ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంద‌ని అన్నారు. ఆరోగ్యానికి మించిన సంప‌ద మ‌రొక‌టి లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చెరువుల‌ను కాపాడుకోవాల‌ని.. వ్య‌ర్థాలు వేసి నీటిని క‌లుషితం చేయ‌వ‌ద్దని సూచించారు. 150 క్రోటాన్ మొక్కలు స్పాన్సర్ చేసిన శ్రీసాయి సిద్ధార్థ విద్యాసంస్థ‌లు కరస్పాండెంట్ ఎస్‌. చంద్రశేఖర్‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా  అభినందించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా అట‌వీ అధికారి బి.జాన‌కిరావు, ఎంపీడీవో ఎంవీఎస్ సుబ్ర‌హ్మ‌ణ్యం, ఈవోపీఆర్డీ వి.వి.రవికుమార్, చేయూత ఫౌండేషన్ సొసైటీ ఉపాధ్య‌క్షురాలు లెంక సంధ్య‌,  అధ్య‌క్షుడు ఎం.రాము స్థానిక న్యాయవాది కె. రామునాయుడు, ఎన్.ఆర్‌.ఈ.జి.ఎస్ ఏపీవోలు సత్యవతి, జి. ప్రతిమాదేవి, వెలుగు ఏపీఎం రమేష్, స్ఫూర్తి అసోసియేష‌న్ అద్య‌క్షుడు వై.వి. సాయి కుమార్, సచివాలయ సిబ్బంది, కేజీబీవీ విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.