ఎన్నికలకు సమస్త ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
1
Visakhapatnam
2021-02-05 19:46:13
విశాఖజిల్లాలో పంచాయితీ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ వెల్లడించారు. జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి గాను సిబ్బందిని నియమించడం, అవసరమైన రవాణా, మెటిరియల్, కోవిడ్ మార్గదర్శకాలను పాటించడానికి పి.పి.ఇ. కిట్లు, మాస్కులు, శానిటైజర్లు సిద్దం చేయడం జరిగిందన్నారు. శుక్రవారం కలెక్టరు ఛాంబరులో తనను కలసిన విలేఖరులతో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను గురించి వివరించారు. ఎన్నికల సందర్భంగా డ్యూటీ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, అందరూ విధులలో వున్నారన్నారు. అనకాపల్లిలో ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియను అబ్జర్వర్ అదేశాల ప్రకారం నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మొదట విడత ఎన్నికలు జరుగుతున్న అనకాప్లలి డివిజన్ లో 12 మండలాల్లో 340 గ్రామ సర్పంచ్ పదవులకు 44 గ్రామాల సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, మిగిలిన 296 సర్పంచ్ లకు 767 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. మొత్తం 3250 వార్డు మెంబర్లకు 804 మంది ఏకగ్రీవంగా ఎన్నికవగా మిగతా 2441 వార్డులకు 5260 అభ్యర్థులు పోటీలో ఉన్నారని వెల్లడించారు.
నర్సీపట్నంలో 2584 వార్డులలోను 8619 మంది పోటీ చేస్తుండగా 261 పంచాయితీలలో 1435 మంది నామినేషన్లు దాఖలు చేశారన్నారు. విలేఖరుల ప్రశ్నకు సమాధానముగా గుర్తుల కేటాయింపు జరగవలసి వుందని, పాడేరులో నామినేషన్ల ప్రక్రియ రేపటి నుండి జరుగుతుందన్నారు. పాడేరులో 3వదశలో రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుంతుందన్నారు. 244 గ్రామ పంచాయితీలకు 2446 వార్డులకు నామినేషన్ల స్వీకరించడం జరుగుంతుంది. పాడేరులో ఉ.6.30 గం. నుండి మ.1.30 గం. వరకు పోలింగు జరుగుతుందని పోలింగు పూర్తవగానే కౌంటింగు జరుగుతుందని వివరించారు. మంచినీళ్లు , విద్యుత్ , శానిటేషన్, రాత్రిబస, భోజనాలు మొదలగు ఏర్పాట్లు గావించడవం జరుగుతుందన్నారు. ఇందుకు గాను రూట్ ఆఫీసర్లు ముందుగా వెళ్లి ఏర్పాట్లు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారన్నారు. ఓటర్లందరూ ఓటింగులో పాల్గొనాలన్నారు.