టీటీడీకి శానిటైజర్లు బహూకరణ..
Ens Balu
3
Visakhapatnam
2021-02-05 20:08:04
వైవి మెడికల్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం 6 లక్షల రూపాయల విలువచేసే శానిటై జర్లు, సోపులు, విటమిన్ టాబ్లెట్లు, ఫేస్ షీల్డ్ లు టీటీడీకి బహూకరించారు. తిరుమల అన్నమయ్య భవన్ వద్ద టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి వీటిని అందించారు. విజయవాడకు చెందిన రాజేశ్వరి మెడికల్స్ సహకారంతో వీటిని అందించామని వైవి మెడికల్ యూత్ అధ్యక్షుడు టి.చంద్రశేఖర్ రెడ్డి, జక్కా సీతారామాంజనేయులు, సురేష్ తెలిపారు. టీటీడీ ఆరోగ్యాధికారి డాక్టర్ ఆర్ ఆర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.