జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయలి


Ens Balu
4
Srikakulam
2020-08-16 14:48:04

జాతీయ నులుపురుగుల దినోత్సవం (డీ వార్మింగు డే)ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎం.చెంచయ్య తెలిపారు.  జాతీయ నులి పురుగుల దినోత్సవంలో భాగంగా కార్యక్రమాన్ని  17వ తేదీ నుండి 20 వ తేదీ  వరకు నాలుగు రోజులు జరుపుటకు ప్రభుత్వం నిర్థయించిందన్నారు. జిల్లాలో 1వ సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలకు డీ వార్మింగ్ మాత్రలు (ఆల్చెండజోల్ 400 మీ.గ్రా) నమిలి చప్పరించి తినిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2 సంవత్సరాల వరకు అర (1/2) మాత్ర,,  2 నుండి 19 సంవత్సరాల వయస్సులోపు ఉన్న బాలబాలికలకు అంగన్ వాడి కార్యకర్త, ఆశా, ఎ.ఎన్.ఎమ్ ద్వారా గ్రామములో బాల బాలికలు అందరికి ఈ మాత్రలు వేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతీ గ్రామములో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్దేశించిన ప్రణాళిక పద్ధతిలో కార్యక్రమము నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయిన తరువాత మరియు మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతీ ఒక్క బాల బాలికలకు ఒక మాత్ర (ఆల్బెండజోల్ - 400 మీ.గ్రా) నమిలి చప్పరించి తినిపించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఆశాకార్యకర్త, ఏ. ఎస్.ఎమ్ తదితర వైద్య ఆరోగ్య సిబ్బంది అంగన్ వాడీ కార్యకర్తల సమన్వయంతో భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు గ్లౌసు ధరిస్తూ సానిటైజర్ రాసుకుంటూ, తల్లిదండ్రులు సమక్షంలో దగ్గర వుండి మాత్రలు తినిపించడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో 1 నుండి 2 సంవత్సరా వయస్సు గల బాలబాలికలు 52,398 మంది, 3 నుండి 5 సం.ల వయస్సు గల బాలబాలికలు 92,193 మంది, 6 నుండి 10 సం.ల వయస్సు గల బాలబాలికలు 1,93,565 మంది, 11 నుండి 19 సం.ల వయస్సు గల బాలబాలికలు 2,53,240 మంది వెరశి 5,91,397 మంది ఉన్నట్లు అంచనా వేయడం జరిగిందన్నారు. మాత్రలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారుల పర్యవేక్షణలో అన్ని ఉప కేంద్రాలకు సరఫరా చేయడం జరిగిందని చెప్పారు. ప్రతీ గ్రామములో ఆశాకార్యకర్తలు, అంగన్ వాడీ కార్యకర్తలు,  స్వచ్చంద సేవా సంఘాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మండల పరిధిలో పి.హెచ్.సి వైద్యాధికారి, ఎం.పి.డి.ఒ, ఎం.ఇ.ఒ, సి.డి.పి.ఒ, సి.ఆర్.పి. పర్యవేక్షణ  చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ మాత్రలు వేసుకొనడం వలన ఏ విధమైన ఔషద దుష్పరిణామాలు ఉండవని, ఒకవేళ ఔషద దుష్పరిణామాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పి. హెచ్.సి. వైద్యాధికారిని సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయిలో వైద్య, ఆరోగ్య శాఖాధికారి, జిల్లా సమన్వయ అధికారిగా, రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమము ప్రోగ్రాం ఆఫీసర్స్, జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి, ఐ.సి.డి.ఎస్ పథక సంచాలకులు పర్యవేక్షిస్తారని చెప్పారు.