తడి, పొడి చెత్తను వేరుగా ఇచ్చేలా చూడాలి..


Ens Balu
3
Visakhapatnam
2021-02-08 20:44:10

తడి చెత్త, పొడి చెత్తను ప్రజలు వేరు చేసి ఇచ్చే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డా. వి సన్యాసిరావు అధికారులు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా, 5వ జోన్ పరిధిలోని 61వ  వార్డులోని చిన్నగంట్యాడ, చైతన్య నగర్, జడ్పీ జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కాలువలను, డ్రైన్స్ ను శుభ్రం చేయాలని, రోడ్డుపై ఉన్న చెత్తలను వెంటవెంటనే వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించాలని, శానిటరీ ఇన్ స్పెక్టరు ను ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్తను సేకరించే ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం, చెత్త తరలించే వాహనాలకు వెహికల్ ట్రాక్స్ ను పరిశీలించారు. ఈ  పర్యటనలో 61వ వార్డు శానిటరి ఇన్ స్పెక్టరు,  వార్డు శానిటరీ  కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.