విజయవాడ నగరాభివ్రుద్ధికి రూ.600 కోట్లు..
Ens Balu
2
Vijayawada
2021-02-08 21:15:10
విజయవాడ నగర అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గత ప్రభుత్వంతో పోలిస్తే విజయవాడ అభివృద్దికి ఎక్కువ నిధులు కేటాయించి నగరాన్ని సుందరీకరిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.93 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు మల్లాది విఘ్ణ, మున్సిపల్ కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్‌తో కలసి మంత్రి సుచరిత ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మట్లాడుతూ అజిత్‌సింగ్ నగర్‌లో 28.50లక్షలతో నిర్మించిన సిహెచ్ రాఘవచారి పార్కును, రాజీవ్‌నగర్‌లో రూ.26 లక్షలతో నిర్మించిన తెలుగు తల్లి పార్కును, కండ్రికల్లో రూ.37.8 లక్షలతో నిర్మించిన సెంట్రర్ లైంటింగ్‌ను ఈ రోజు ప్రారంభించామని, ఇంకనూ నగర అభివృద్దికి అనేక ప్రణాళికలు సిద్దం చేశామని మంత్రి అన్నారు. విజయవాడ నగరాన్ని రూ.600 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని, విజయవాడ నగరాభివృద్ది పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ప్రత్యేక శద్ద వహిస్తున్నారని మంత్రి అన్నారు. నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా పార్కులను అభివృద్ది చేస్తున్నామని అన్నారు. నగరంలో డ్రెయిన్‌ల నిర్మాణం త్రాగునీటి సరఫరా మొదలగు మౌలిక సదుపాయలకు ప్రాధాన్యత ఇస్తూన్నామని మంత్రి అన్నారు. నగరంలో నివసిస్తున్న వేలాదిమంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందని మంత్రి అన్నారు. రానున్న రోజులో విజయవాడ నగరాన్ని మరింత అభివృద్ది చేసి దేశంలోనే ముఖ్య నగరాల్లో ఒకటిగా నిలుపుతామని మంత్రి అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేసి పేదల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూందని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ సమావేశంలో పోలిస్, మున్సిపల్ శాఖాధికారులు, ప్రజలు పాల్గొన్నారు.