ఈవీఎంలకు పటిష్ట భద్రత కల్పించాలి..
Ens Balu
2
కాకినాడ
2021-02-09 18:58:00
తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) యూనిట్ల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కాకినాడ కలెక్టరేట్ పక్కన ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, నివేదికలు సమర్పించే ప్రక్రియలో భాగంగా కలెక్టర్.. అధికారులతో కలిసి తనిఖీ నిర్వహించారు. గోదాములోని ఈవీఎం, వీవీప్యాట్ యూనిట్ల భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఫిజికల్ వెరిఫికేషన్‌లో భాగంగా ఈవీఎం బాక్సుల బ్యాలెట్ యూనిట్ల బార్‌కోడ్ స్కాన్ ప్రక్రియను పరిశీలించారు. తనిఖీలో కలెక్టర్ వెంట డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు ఎం.జగన్నాధం, రమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.