కోవిడ్ వాక్సిన్ వేసుకున్న జె.సి..
Ens Balu
2
Srikakulam
2021-02-10 13:29:32
శ్రీకాకుళం సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ కోవిడ్ వాక్సిన్ ను బుధవారం వేయించుకున్నారు. జిల్లాలో జనవరి 16వ తేదీన వైద్యులు, వైద్య సిబ్బందికి వాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైన సంగతి అందరికి విదితమే. తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా ఇచ్చే కార్యక్రమం జిల్లాలో ప్రారంభమై, దశల వారీగా టీకా అందరికి వేయడం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీకాకుళం పట్టణంలోని బర్మా కాలనీలో గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యు.పి.హెచ్.పి)లో బుధవారం భారత్ బయోటెక్ తయారు చేసిన కో-వాక్సిన్ టీకాను జె.సి వేయించుకున్నారు. బర్మా కాలనీ యు.పి.హెచ్.పి ఎ.ఎన్.ఎం టి.శేషకుమారి ఈ టీకాను సంయుక్త కలెక్టర్ కు వేసారు. కో వాక్సిన్ టీకాను వేయడం జరిగిందని, 28 రోజుల తరువాత మరో డోస్ కో వాక్సిన్ టీకాను వేయించుకోవలసి ఉంటుందని టి.శేషకుమారి సంయుక్త కలెక్టర్ కు సూచించారు. టీకా తీసుకున్నప్పటికి మాస్కుధారణ, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని జె.సికు ఆమె సూచించారు.
టీకా తీసుకొనుటకు యు.పి.హెచ్.పి కేంద్రానికి చేరుకున్న సంయుక్త కలెక్టర్ కు బర్మా కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు డా. నిర్మలా మల్లేశ్వరి, ప్రత్యేక అధికారి పి.వి.యస్.ప్రసాదరావు స్వాగతం పలికి టీకా ఇస్తున్న వివరాలను తెలిపారు. టీకా తీసుకున్న అనంతరం సంయుక్త కలెక్టర్ అబ్జర్వేషన్ రూమ్ లో 30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం కె.లలిత కుమారి, ఎ.నిర్మల, ఫార్మాసిస్ట్ ఎ.శాంతిశ్రీ, ల్యాబ్ టెక్నిషీయన్ జి.శ్రీరాములు, సచివాలయ సిబ్బంది పి.సూర్యకళ, ఆశా వర్కర్ కె.పావని తదితరులు పాల్గొన్నారు.