ఆశా ఇమ్మానియల్‌కు గ్లోబల్‌ ‌టీచర్‌ అవార్డు..


Ens Balu
2
Andhra University
2021-02-11 21:35:23

ఆంధ్రవిశ్వవిద్యాలయం కెమికల్‌ ఇం‌జనీరింగ్‌ ‌విభాగం ఆచార్యులు సి.హెచ్‌ ఆశా ఇమ్మానియల్‌ ‌రాజుకు గ్లోబల్‌ ‌టీచర్‌ అవార్డు లభించింది. సమాజాన్ని ప్రభావితం చేసే ప్రభావవంతమైన అధ్యాపకులు, ఆచార్యులను గుర్తించి ప్రతీ సంవత్సరం ఏకెఎస్‌ ఎడ్యుకేషన్‌ అవార్డు సంస్థ గ్లోబల్‌ ‌టీచర్‌ అవార్డులను ప్రధానం చేస్తోంది. ఈ సంవత్సరం ఆచార్య ఇమ్మానియల్‌ ‌రాజుకు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో రాజును అభినందించారు. అనంతరం విసి మాట్లాడుతూ, ఏయూకి మంచి అవార్డులు రావడం అంటే ఆచార్యుల పనితనానికి నిదర్శమని అన్నారు. రానున్న రాజుల్లో మరిన్ని అవార్డులు స్వీకరించి ఏయూకి, ఆచార్యులు మరింత పేరు తీసుకురావాలని కోరారు.