జీవిఎంసీ బడ్జెట్ కి సూచనలివ్వండి..


Ens Balu
3
GVMC office
2021-02-11 22:09:18

మహా విశాఖ నగర పాలక సంస్థ బడ్జెట్ రూపకల్పనలో ప్రజలను భాగస్వామ్యం కావాలని జీవీఎంసీ కమిషనర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో కోరారు. “జనాగ్రహ స్వచ్ఛంద సంస్థ” నిర్వహించే సర్వేకు ప్రజలందరూ కూడా సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు ద్వారానే కాకుండా, వెబ్ సైట్  i.e. www.janaagraha.org/vizag లేదా http://bit.ly/CitizenInputForm లింక్ ద్వారా తమ అభిప్రాయాలను, తేది.15-02-2021లోపు తెలుపవలసినది అని కమిషనర్ కోరారు. అత్యధిక శాతం ప్రజలు ఇచ్చిన సూచనలను స్వీకరించి జీవిఎంసీ వాటిని పొందుపరచడానికి ఆస్కారం వుంటుందని ఆమె ఆ ప్రకటనలో కోరారు.