నగరంలో ప్రతిపాదిత పనుల పరిశీలన..


Ens Balu
3
Gopalapatnam
2021-02-11 22:43:25

జీవిఎంసీ పరిధిలో చేపట్టే ప్రతిపాది పనులపై అధికారులు తక్షణమే నివేదించాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ డా.జి.స్రిజన ఆదేశించారు. గురువారం  ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆరవ జోన్ లో పలు ఇంజనీరింగ్ ప్రతిపాదనలను పరిశీలించారు. మొదటిగా, గోపాలపట్నం రైతుబజార్ లో ఏర్పాటు చేయదలచిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను అక్కడ వారితో చర్చించి, వారికి అవసరమైన పనులను ప్రతిపాదించాలని ఆరవ జోనల్ స్థాయి అధికారులను ఆదేశించారు. తదుపరి, మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ లో ఏ.డి.బి. ఆర్థిక సహాయం క్రింద రూ.12.50కోట్లతో ఏర్పాటు చేయదలచిన మూడు మెగావాట్ల సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ ను పనుల సన్నద్ధత గూర్చి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. సోమవారం నుండి చెప్పిన విధంగా పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం, పట్టణ ప్రణాళికకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అసిస్టెంట్ సిటీ ప్లానర్ కు కొన్ని సూచనలు చేసి, వివరాలను తరువాత సమర్పించాలన్నారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీర్లు కె.వి.ఎన్.రవి, శివ ప్రసాద రాజు, ఆరవ జోనల్ కమిషనర్ చక్రవర్తి, జోనల్ స్థాయి ఇంజనీరింగ్ మరియు పట్టణ ప్రణాళిక అధికారులు, సోలార్ రెన్యూ పవర్ లిమిటెడ్ ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.