సెక్యూరిటీ గదులు ప్రారంభం..


Ens Balu
2
Andhra University
2021-02-12 15:24:33

ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఎదురుగా నూతనంగా నిర్మించిన సెక్యూరిటీ గార్డుల గదులను ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సెక్యూరిటీ గదులను పరిశీలించారు. విశ్వవిద్యాలయంలో బధ్రత చర్యలు పటిష్టం చేస్తున్న నేపధ్యంలో పరిపాలనా భవనం ఎదురుగా నూతనంగా రెండు సెక్యూరిటీ గార్డుల గదులను నిర్మించారు. వీటిని నేడు ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్‌ ‌సెక్యూరిటీ ఆఫీసర్‌ ‌మహ్మద్‌ ‌ఖాన్‌, ‌వర్సిటీ ఇంజనీర్‌ ఆర్‌.‌శంకర రావు తదితరులు పాల్గొన్నారు.