స్టీల్ ప్రైవేటీకరణ విరమించుకోవాల్సిందే..


Ens Balu
2
Steel Plant
2021-02-13 14:05:49

కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరంచేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డివైఎఫ్ఐ నగర అధ్యక్షులు కె.మహేష్ అన్నారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు డివైఎఫ్ఐ కూడా తన మద్దతు ప్రకటించింది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యువత  మానవహారం  నిర్వహించారు. ఎన్నో ఉద్యమాలు, ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన విశాఖ సెంటిమెంటు నవరత్న కర్మాగారాన్ని ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే యోచర విరమించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదన్నారు. అనంతరం స్టీల్ కార్మికులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి వై ఎఫ్ ఐ  నగర నాయకులు షణ్ముఖ, ప్రసన్న, రాజేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.